BCCI yet to pay World T20 prize money to women cricketers
#Teamindia
#Bcci
#ICC
#SouravGanguly
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.. బీసీసీఐ. క్రికెట్ ఆడే దేశాలన్నింట్లోకీ అత్యంత ధనికవంతమైనది. రిచ్చెస్ట్ బోర్డుగా పేరుంది దీనికి. స్పాన్సర్ల రూపంలో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తోంది. అలాంటి బోర్డు.. భారత మహిళల క్రికెట్ జట్టుకు కేటాయించాల్సిన ప్రైజ్‌మనీని సుమారు 15 నెలల పాటు తన వద్దే అట్టి పెట్టుకుని ఉందంటే నమ్మగలరా?. ఇది నిజం. టీమిండియా విమెన్స్ జట్టుకు ఇవ్వాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తన ఖజానాలో నుంచి విడుదల చేయడానికి ఇన్ని నెలల పాటు కాలయాపన చేసింది. చివరికి- విదేశీ మీడియా వేలెత్తి చూపితే గానీ- కళ్లు తెరచుకోలేదు.