Hyderabad City is gearing up for Global Entrepreneur Summit which is going to be held soon. Already, the government of Telangana is trying hard to change the city in order to impress the delegates freezing the event. The latest update is that Mega Power Star Ram Charan is going to be a part of the event and will be delivering a speech.
గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూయర్‌షిప్ సమ్మిట్‌కు హెచ్ఐసీసీ ముస్తాబు అయింది. ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, సీఎం కేసీఆర్, కేంద్రమంత్రులు, రాయబారులు, ఇతర ప్రముఖుల కోసం ముందు వరుసలో సోఫాలు వేశారు. ఆ తర్వాత ప్రతినిధులు కూర్చుంటారు.
సదస్సుకు 1500 మంది వస్తున్నారు. నిర్వాహకులు, భద్రతా బలగాలు కలుపుకొని రెండువేల మందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అందరికీ కనిపించేలా ఎత్తైన వేదికను, మూడు డిజిటల్ థియేటర్లు ఏర్పాటు చేసారు. నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ, పర్యవేక్షణ ద్వారా పనిచేసే వారిలో మహిళల వాటా పెంచడంపై బుధవారం ఉదయం ప్లీనరీ సదస్సు నిర్వహిస్తారు. దీనిలో ఇవాంక ట్రంప్‌తో కలిసి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వేదిక పంచుకోనున్నారు. పనిచేసే చోట మహిళలకు అవకాశాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చిస్తారు.
బ్రిటన్ మాజీ అధ్యక్షుడు టోనీ బ్లెయిర్ భార్య చెరీ బ్లెయిర్, డెల్ ఈఎంసీ చీఫ్ కస్టమర్ ఆఫీసర్ కరేన్ క్విన్‌టోస్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ తదితరులు ప్రసంగిస్తారు. సమన్వయకర్తగా మంత్రి కేటీఆర్ ఉంటారు.