Ivanka Trump is making a significant solo outing by headlining a business conference in India, but her trip highlights questions about whether her message of empowering poor women matches her actions
ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్ ధరించిన దుస్తులపై విదేశీ మీడియా విమర్శలు చేసింది. హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టినపుడు ధరించిన తెల్లటి ముత్యాలు కలిగిన నల్లని కోటు భారతీయత ఉట్టిపడేలా ఉందని అంటూనే మంగళవారం ధరించిన దుస్తులపై పెదవి విరిచింది.
జీఈఎ్‌సకు హాజరైనపుడు ధరించిన ఆకు పచ్చ గౌను హుందాగా లేదని విదేశీ మీడియా విమర్శించింది. ఆకుపచ్చ రంగుతో సిల్కు బట్ట అద్భుతంగా ఉంది గానీ దానిపై ఉన్న పసుపు రంగు, గులాబీ రంగు పూలతో సిల్కు వల్ల సహజత్వం పోయిందని వెల్లడించింది.
మెడను పూర్తిగా కప్పి ఉంచేలా నెక్, ఛాతి వద్ద ఉన్న రంధ్రం ఏ మాత్రం నప్పలేదని, మోకాళ్లను, మోచేతులను కప్పేలా ఉన్న ఆ డ్రెస్ డిజైన్ జపాన్ సంప్రదాయ దుస్తులు కిమోనో మాదిరిగా ఉందని విదేశీ మీడియా అభిప్రాయపడింది.
ఇవాంక తొలిసారి ధరించిన డ్రెస్‌కు, రెండో సారి ధరించిన డ్రెస్‌కు ఏ మాత్రం పొంతన లేదని విమర్శించింది. మొత్తంగా ఆ గౌను ఏమాత్రం గుర్తుండిపోయేలా లేదని అభిప్రాయపడింది ఆమె ధరించిన బూట్లు అధ్వానంగా ఉన్నాయని తెలిపింది. ఆ ఆకుపచ్చ డ్రెస్‌కు, నల్లని షూ అవగాహనలేమిని స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించింది.