American Intelligence officials shocked after security details leak during the dinner of ivanka trump in falaknuma palace
ఓవైపు అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్‌తో కూడిన అత్యంత టైట్ సెక్యూరిటీ, మరోవైపు సెంట్రల్ ఇంటలిజెన్స్ నిఘా(సీఐఏ).. ఈ రెండింటి సమన్వయంతో ఇవాంకా ట్రంప్ భద్రత పకడ్బంధీగా ప్లాన్ చేశారు. ఇంత పకడ్బంధీగా ప్లాన్ చేసినప్పటికీ.. ఇవాంకా సెక్యూరిటీ వివరాలు లీక్ అవడం సీఐఏను ఆశ్చర్యానికి గురిచేసింది. అసలే ఇక్కడి పోలీసులపై నమ్మకం లేని సీఐఏకు ఇప్పుడి సెక్యూరిటీ లీక్ మరింత అపనమ్మకాన్ని పెంచుతుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంగళవారం గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సదస్సులో పాల్గొన్న ఇవాంకా ట్రంప్.. రాత్రి 8గం.కు ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రధాని మోడీ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఫలక్‌నుమా డైనింగ్ టేబుల్‌పై ప్రధాని మోడీ, ఇవాంకా ట్రంప్, తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ విందు ఆరగించారు. వంద కన్నా ఎక్కువమంది ఒకేసారి భోజనం చేయడానికి అనువుగా ఉన్న ఈ డైనింగ్ టేబుల్ పై ఇవాంకా ఎక్కడ కూర్చుంటారన్నది సీఐఏ తొలి నుంచి గోప్యంగా ఉంచుతూ వచ్చింది.