Hyderabad’s Mayor Bonthu Rammohan was in for a rude shock when he found out that the state’s general administration department (GAD) had not sent him an invitation to attend.
హైదరాబాద్ నగర ప్రథమ పౌరుడు బొంతు రామ్మోహన్‌కు అవమానం జరిగింది. ప్రథమ పౌరుడిగా ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు అతిథులను ఆహ్వానించాల్సింది ఆయనే. కానీ ఆయనకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా బేగంపేట విమానాశ్రయంలో ఆయనను చిన్నచూపే చూశారు. తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ (జిఎడి) ఆయనను గుర్తించిన పాపాన పోలేదని అంటున్నారు.
తనకు జరిగిన అవమానానికి బొంతు రామ్మోహన్ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఆ వార్తలను ఆయన ఖండించారు. తాను రాజీనామా చేయనున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేసారు.