Actress Rakul Preet Singh is the hottest bueaty in Tollywood. Now she is doing movies with Senior Heroes and Young Heroes too. Rakul has many success than other herones
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ ఎవరంటే రకుల్ ప్రీత్ సింగ్ అని ఠక్కున సమాధానం వస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరోలతోపాటు, యువ హీరోలతో కూడా జత కడుతూ వరుస విజయాలను సొంతం చేసుకొంటున్నది. కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దక్షిణాది, బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నది. ఎప్పటికప్పుడు కథాబలం ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకొంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ మల్టీస్టారర్ చిత్రానికి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.
గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్‌ను అందించిన దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం దాగుడుమూతలు అనే మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు. డీజే చిత్రాన్ని రూపొందించిన దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాత. ఈ చిత్రంలో నితిన్, శర్వానంద్ హీరోలుగా నటిస్తున్నారు.
ఈ ఇద్దరు కుర్ర హీరోల సరసన నటించేందుకు ఇప్పటికే సాయి పల్లవిని ఎంపిక చేసుకోగా, మరో హీరోయిన్ రకుల్ పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం రకుల్‌తో డేట్లు, రెమ్యునరేషన్ తదితర విషయాలపై ఇంకా చర్చలు జరుగుతున్నాయనేది తాజా సమాచారం.