Priyanka Chopra Quits As Nirav Modi Brand Ambassador

Oneindia Telugu 2018-02-24

Views 2

Actor Priyanka Chopra has now terminated her contract and quit as the brand ambassador of Nirav Modi jewels.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెట్టిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా గుడ్‌బై చెప్పేసింది. ఆయన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రియంక ఇందుకోసం కుదుర్చుకున్న కాంట్రాక్టును తాజాగా రద్దు చేసుకుంది. ఇటీవల నీరవ్‌పై వెలుగుచూసిన ఆరోపణల క్రమంలో ఆయన కంపెనీ బ్రాండ్‌తో కాంట్రాక్ట్ రద్దు చేసుకోవాలని ప్రియాంకచోప్రా నిర్ణయించినట్టు ఆమె తరఫు ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. 2017 జనవరిలో నీరవ్ మోడీతో బ్రాండ్ ప్రచారానికి ప్రియాంక చోప్రా అగ్రిమెంట్ చేసుకుంది.
అప్పట్నించి ఆ బ్రాండ్ కోసం పలు ప్రచార ప్రకటనల్లో నటించింది. నీరవ్ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రియాంకతో పాటు, మోడల్ కమ్ నటి లిసా హేడెన్ కూడా ప్రచారం సాగిస్తోంది. రూ.11,400 కోట్ల మేరకు తమను మోసం చేసినట్టు ఇటీవల పీఎన్‌బీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ, ఈడీ దేశవ్యాప్తంగా నీరవ్ ఆస్తులపై దాడులు సాగిస్తోంది. ఇప్పటికే నీరవ్‌పై రెండు ఎఫ్ఐఆర్‌లను కూడా ఏజెన్సీ సంస్థలు నమోదు చేశాయి. సీబీఐ దర్యాప్తు ప్రారంభానికి ముందే నీరవ్, ఆయన భార్య, వ్యాపార భాగస్వామి మెహుల్ చోక్సీ విదేశాలకు ఉడాయించిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form