Sri Reddy Mallidi Mallidi is news presenter and actor in Television Industry. Later, She became actress. She tested her water on silver screen.
సినీ నటి శ్రీరెడ్డి మల్లిడి సంచలన వ్యాఖ్యల జోరు సోషల్ మీడియాలో కొనసాగుతునే ఉంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేస్తూ శనివారం (ఏప్రిల్ 7) హైదరాబాద్ ఫిలిం చాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తనకు జరుతున్న అన్యాయంపై ఆమె సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపించారు. నిరసన తర్వాత తన పరిస్థితి దారుణంగా తయారైందని, అయినా తన పోరాటాన్ని ఆపబోనని శ్రీరెడ్డి స్పష్టం చేశారు.
నేను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని నాకు కాల్ చేశాడు. వెంటనే ఇళ్లు ఖాళీ చేయాలని సూచించాడు. అతడు ఓ ఐఏఎస్ ఆఫీసర్. ఎంతటి కుచ్చిత స్వభావమో మీరే చూడండి. పెద్దలంటే ఇలానే ఉంటారా? కొందరు ఎంత నీచంగా మాట్లాడుతున్నారో మీరు ఊహించుకోలేరు. పెద్దల గేమ్ మొదలైంది అని ఫేస్‌బుక్‌లో శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.
సమాజంలోని పెద్దలు మీడియాను మేనేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ వారు నా నిరసనను ఆపడంలో విఫలమయ్యారు. ఇండస్ట్రీలోని కొందరు గొప్ప యాక్టర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. వారి బెదిరింపులకు లొంగిపోను.
మీ దృష్టిలో నేను చిన్నదానిని కావొచ్చు. కానీ నా నిరసన మాత్రం కాదు. ఈక కూడా పీకలేదు అనే మొండి ధైర్యానికి హ్యాట్సాఫ్ అని మరో ట్వీట్‌లో శ్రీరెడ్డి పేర్కొన్నారు.
నాకు సొంత ఫ్లాట్, అందమైన కారు ఉందని కొందరికి కళ్ల మంటగా ఉంది. నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను. ఏదో ఒకరోజు అది అందరికీ జరిగిదే. ఒకవేళ నాకు ఇల్లు, ఆస్తులు ఉంటే అమ్ముకొని హాయిగా జీవించే దానిని. ఇలా రోడ్డున పడి నిరసన తెలుపాల్సిన అవసరం లేదు. తెలుగు కళాకారుల కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం కోసం పోరాటం చేయడం తప్పు కాదు కదా. తెలుగు అమ్మాయిలను హీరోయిన్లుగా చూడటమే నా కల అని శ్రీరెడ్డి వెల్లడించింది.