Asia Cup 2022 Shedule:India vs Pakistan match on August 28 And final match on September 11 | ఆసియా కప్ 2022 షెడ్యూల్ వచ్చేసింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీ మ్యాచ్‌ల వివరాలను ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మంగళవారం ప్రకటించింది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ టోర్నీ జరగనుంది. దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరగనుండగా, మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆగస్టు 28(ఆదివారం) ఆడనుంది. రెండో మ్యాచ్‌ను క్వాలిఫయర్ జట్టుతో 31న ఆడనుంది. సెప్టెంబర్ 3న సూపర్ 4 మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా ఫైనల్ సెప్టెంబర్ 11న దుబాయ్ వేదికగా జరగనుంది.
#AsiaCup2022Shedule
#INDVSPAKMatch
#IndiavsPakistan
#asiacupmatchestimings