Pak Reprimanded By Anti-Corruption Official

Oneindia Telugu 2018-05-25

Views 85

An anti-corruption official reprimanded Pakistan’s players for wearing smart watches on the opening day of the first Test at Lord’s, ordering players to stop wearing them.
#cricket
#england
#icc
#Warning

పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక జారీ చేసింది. క్రమశిక్షణను ఉల్లంఘించరాదని ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ తొలి రోజు అనంతరం ఇలా పేర్కొంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆటగాడైన హసన్ అలీ వెల్లడించారు.
రెండో రోజు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ.. టీమ్‌లోని ప్లేయర్స్ ఎవరూ స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకోవద్దని ఐసీసీ స్పష్టంచేసింది. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక బృందం పాక్ టీమ్‌ను కలిసింది. దాదాపు ఓ మొబైల్ ఫోన్‌లాగే గ్రౌండ్ నుంచే టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌లు పంపే వీలున్న స్మార్ట్‌వాచ్‌లను చూపించి ఇలాంటి వాటిని వాడేందుకు వీల్లేదని నిరాకరించింది.
'మా జట్టులో ఎవరో అలాంటి వాచ్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆ వాచ్‌ను ఎవరు పెట్టుకున్నారో తెలియదుగానీ.. ఐసీసీ అధికారులు మాత్రం అలాంటివి గ్రౌండ్‌లో కుదరవన్నారు' హసన్ అలీ చెప్పాడు. తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ను 184 పరుగులకు ఆలౌట్ చేసిన పాకిస్థాన్.. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించింది. ప్లేయర్స్ ఎలాంటి సమాచార వ్యవస్థను తమ వెంట తీసుకెళ్లకుండా ఐసీసీ నిషేధం విధించింది.
మ్యాచ్ ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రెస్ పాకిస్థాన్ క్రికెటర్లు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధాలు కూడా ఎదుర్కొన్నారు. 2010లో ఇంగ్లండ్ టూర్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ముగ్గురు క్రికెటర్లు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడదే ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న పాక్ క్రికెటర్లకు ఐసీసీ ముందే ఓ వార్నింగ్ ఇచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS